Pages

Tuesday 16 June 2015

ఎ.సి.బి అరెస్ట్ కు ముందు చంద్రబాబు పెట్టుతున్న కొన్ని ఆంక్షలు


‘ఓటుకు నోటు’ కేసులో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అరెస్ట్ ఖాయం అని నిర్ణయం అయిన తరువాత తన మనసుల ఉన్న కింది కోరికలను తెలంగాణా ప్రభుత్వం మరియు ఎ.సి.బి  విధిగా అమలు చెయ్యాలి అని కోరుతున్న చంద్రబాబు నాయుడు.
1. వోట్ కి నోట్ అనే శిక్ష వేసేటప్పుడు దాన్ని "చంద్రబాబు వోట్ పథకం" గా భారత ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టం చేసి గుర్తించాలి.
2. జైలు లో ఉన్న తన అర్ర మొత్తం గోడలపై పసుపు పచ్చ రంగులే వేసి దాని మీద  "జై చంద్రబాబు", "జై తెలుగు దేశం" "బ్రింగ్ బ్యాక్ బాబు" , "బాబు వస్తేనే జాబు" "ఆంధ్ర తేజం బాబు"  అనే స్లొగన్స్ ఉండాలి.
3. మైక్ లో మాట్లాడంది, వీడియో కాన్ఫరెన్స్ లో కనపడకపోతే నిద్ర రాదు కాబట్టి, పని చెయ్యని బొమ్మ మైక్, కనెక్షన్ లేని పెద్ద టి.వి సెట్ ని రూం లో పెట్టాలి.
4. తన దగ్గరి దోస్తులు అయిన బిల్ గేట్స్, బిల్ క్లింటన్ తో మాట్లాడడానికి ఒక స్పెషల్ ఫోన్ ని ఏర్పాటు చెయ్యాలి.
5. సింగపూర్ నుండి ఎవరైనా తనను కలవడానికి వస్తే అడ్డు చెప్పకుండా సక్కగా వాళ్ళను తన ఉన్న జైలు కి తోలుకొని రావాలి.
6. ఒక్కసారి జైలు లో అడుగు పెట్టిన తరువాత తెలంగాణా ప్రబుత్వం తన మీద ఉన్న పాత కేసులు అన్ని కొట్టేయాలి మల్ల బావిషత్తు లో కూడా ఏమి కేసులు పెట్టదు.
7.  తన కార్యకర్తలు అయిన ఎర్రబెల్లి, మోత్కుపల్లి, రమణ, సోమిరెడ్డి, నన్నపునేని రాజకుమారి, గాలి ముద్దుకృష్ణ, పరకాల ప్రభాకర్ తో ఒక భజన మండలి ఏర్పాటు చేసి తను లేసినప్పుడు, మల్ల పడుకునేటప్పుడు వీళ్ళ భజన తప్పనిసరిగా ఉండేటట్టు తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి.
8.  జైలు అర్రల ఉండే టి వి ల తన బామ్మర్ది బాలయ్య సినిమాలు సుపెట్టాలి. ఓపెన్ హార్ట్ విత్ అర్.కే  అనే కార్యక్రమాన్ని తన జైలు గదిలో నిర్వహించాలి, తెలంగాణా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను నేరుగా ఆంధ్ర ప్రజలకు చెప్పే వీలు కల్పించాలి.
9. తన ను ఎవ్వరు జైలు లో కలుస్త అన్ని ఎలాంటి అభ్యంతరాలు పెట్టకుండా అనుమతి ఇవ్వాలి, కానీ ఒక్క వై ఎస్ షర్మిల, లక్ష్మి పార్వతి  "జైలు లో పరామర్శ యాత్ర" కు మాత్రం  అనుమతి మాత్రం ఇవ్వద్దు.
10. తెలంగాణా ప్రభుత్వం తన సొంత ఖర్చులతోటి ఇంగ్లీష్ ట్యూషన్ మరియు "వాయిస్ అండ్ అక్సెంట్' ట్రైనింగ్ ఇప్పియ్యాలి.

 
Chandrababu’s Terms & Conditions Before Arrest By Telangana ACB

The wish list of AP Chief Minister Chandrababu Naidu before arresting by ACB of Telangana government
1. Since his arrest in the case of Cash-for-vote scandel, the government should make a law in Parliament and rename it as “Chandrababu Vote Yojana”.
2. The walls of jail cell should be painted with slogans like “ Bring Back Babu”, “Jai Telugu Desham”,  “Andhra Tejam Babu”, ‘Babu For Job”.
3. Telangana government should provide him with wireless hand mike, and vide conference toy set for playing to get peaceful sleep.
4. The jail authorities should install a direct telephone line to speak with his close friends Bill Gates and Bill Clinton.
5. Singapore officials whoever want to meet him should be directly escorted from airport to his jail room without making any technical problems.
6. The government of Telangana should strike off all the old and pending cases against him as soon as he steps into the jail.
7.  A bhajana mandali consisting of Errabelli Dayakar Rao, Mothkupalli, Ramana, Somireddy, Nannapuneni, Gali Muddhukrishna and Parakala Prabhakar should be formed and ensure that every morning and evening they do some bhajana for smooth sleep.
8. The original TV set should play all the movies of his brother-in-law Balayya without any interruption. He should be allowed to give interview with ABN Andhra Jyothi titled as “Open Heart With RK”.
9.  Government should not object any visitors to meet him in jail, except YS Sharmila and Laxmi Parvathi.
10. Telangana government should teach him English lessons and train in voice and accent with their own expenses.

Disclaimer: The above Telugu and English article (unless explicitly and clearly mentioned) are a work of fiction. Readers are advised to read it in right spirit and not confuse the content with real happenings. Even if it resembles someone, it's probably just a coincidence.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...