Pages

Monday 30 November 2015

Who Is Tolerant?

 

Tolerance

Sunday 15 November 2015

ఉగ్రవాదుల తప్పు ఏమి లేదు , అంత అమెరికా తప్పు అంటా…

ఈ రోజు ( 15-నవంబర్ -15) నమస్తే తెలంగాణా పేపర్ లో వేణుగోపాల స్వామి గారు రాసిన "ఉగ్రవాద మూలాలు ఎక్కడ? " అనే వ్యాసం పై నా అభిప్రాయం..

namasthe telangana nov 15

పై వ్యాసం ద్వార తెలుస్తన్నది ఏంటిది అంటే....

- ఉగ్రవాదులు తెలిసీ తెలియక అమలు చేస్తున్నది అమెరికా కూటమి అజెండానే! దీనికి మూలాలు అమెరికా విధానాలలోనే ఉన్నాయి.

-ఐఎస్‌ఐఎస్, అల్ కాయిదా వంటి ఉగ్రవాద సంస్థలకు ప్రోత్సాహమిస్తున్నదీ, ఆయుధాలు సహాయాలు ఇతర అందిస్తున్నది అమెరికా మిత్రదేశాలే, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి పెద్ద రాజ్యాలు నాటుతున్న విష బీజాల ఫలాలను ఆయా దేశాల ప్రజలతోసహా ప్రపంచంలోని అన్ని సమాజాలూ అనుభవించవలసి వస్తున్నది.

-ఉగ్రవాదాన్ని అణచివేయడం పేరుతో అఫ్ఘనిస్థాన్, ఇరాక్, లిబియాలపై దాడి చేసిన అమెరికా, ఇప్పుడు సిరియాలో దాడులు సాగిస్తున్నది.

-పాశ్చాత్య పాలక వ్యవస్థను పటిష్టం చేసేందుకు లేదా కార్పొరేట్ పాలన పేర నిరంకుశ ప్రపంచాన్ని సృష్టించేందుకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి పెద్ద రాజ్యాలు తమ పరిధిలోని మేధో బృందాలు, వ్యవస్థలు పనిచేస్తున్నాయి.

- మరో అభిప్రాయం: అమెరికా, యూరప్ దేశాలు అరబ్బు (లేదా ముస్లిం) రాజ్యాలపై దాడులు సాగిస్తున్నందు వల్ల నే అందుకు ప్రతీకారంగా ఈ ఉగ్రవాదం తయారైందన్నారు.

-ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేయాలని కోరుకునే వారు కూడా, ఈ హింస పాశ్చాత్య దేశాలు కోరి తెచ్చుకుంటున్న ముప్పుగా భావిస్తున్నారు.

-ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదమూ బయటి నుంచి రుద్దబడినవి.

సరే ఒకసారి వేణుగోపాల స్వామి గారి చెప్పింది సహేతుకమైనది అనుకుంటే…..ఇవి కూడా కొంత వరకు సహేతుకమే అనిపిస్తుంది…

-కొన్ని ఇస్లామిక్ దేశాలల్లో అమెరికా దాని మిత్ర దేశాల కుట్రలను అర్థం చేసుకోలేని మేధావులు, ప్రజలు అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ లాంటి సంస్థలకు ఆకర్షణకు గురు అయ్యి, తమ తోటో ప్రజలను , సున్ని లు, షియా, క్రిస్టియన్ లు, ఇస్లాం పాటించని కాఫిర్లు గా విడగొట్టి మరణ హోమ సృస్తిస్తున్నారు. అంటే వీళ్ళు ఎంత ముర్కులు అంటే మరణ ఆయుధాలు కల్పిస్తే చాలు ఎవరిని చంపమంటే వాళ్ళను చంపే కిరాయి హంతకులు అన్నట్టు.

-ప్రపంచ రాజకీయ ఆధిపత్య పోరులో అమెరికా దాని మిత్ర దేశాలు ఇస్లాం మతాన్ని, ఖురాన్ గ్రంధాన్ని అడ్డం పెట్టుకొని వాటిని తు. చ. తప్పకుండా పాటిస్తున్నామని పలికిస్తూ మనుషులను ఉగ్రవాదులుగా మార్చడం చాల సులభం అని ప్రపంచానికి నేర్పించయా?

-ఇస్లామిక్ స్టేట్ అనే ఉగ్రవాద సంస్థ ప్రపంచం మొత్తం ఇస్లాం మతాన్ని వ్యాప్తి చెయ్యడమే మా లక్షం అని చెప్పుతున్నది గూడా అమెరికా కూటమి అజెండనేనా ?

-మనుషులను ఉగ్రవాదులుగా మార్చడానికి ఖురాన్ లోని కొన్ని సూక్తులను ఉపోయోగించు కోవచ్చా? ఎందుకంటే ఐ ఎస్ తీవ్రవాదులు దాడులు చేసిన ప్రతిసారి “అల్లాహో అక్భర్” అని నినాదాలు ఇవ్వమని కూడా చెప్పరా ?

- ఇస్లామిక్ స్టేట్ పరిధిలో ఉన్న ప్రాంతంలో ఇస్లాం న్యాయ పద్ధతిలో అనగా షరియా ప్రకారం క్రురంగా శిక్షలు వేస్తున్నప్పుడు , తలకాయలు కోయడం, మంటల్లో కాల్చడం , మెడలకు బాంబులు పెట్టి చంపడం, ఆడవాళ్లన్ను మానభంగం చెయ్యడం, ఇతర మతస్తులను బానిసలుగా చెయ్యడం, పిల్లలను కట్టేసి తుపాకులతో కాల్చడం లాంటి పనులను సమర్ధించే సూక్తులు షరియా లో ఎవరు రాసిండ్రు? అమెరికా దాని మిత్ర పక్ష దేశాలు రహస్యంగా బిల్డెర్‌బెర్గ్ గ్రూప్ సమావేశం లో రాసి ఇచ్చినయా?

-ఇస్లాం ని పాటించే కొన్ని దేశాలు, మేధావులు తమ ఆత్మ గౌరవాన్ని అమెరికా దాని మిత్ర దేశాల చెప్పు చేతుల్లో ఉండే అంత బలహినమైనవా?

-సిరియా లోని పురాతన కట్టడాలను, ఒక వర్గం వారికీ చెందిన మస్జిద్ లను, ఆఫ్ఘనిస్తాన్ లోని బుద్దుని విగ్రహాలను పడగొట్టడం కూడా ప్రపంచ రాజికియ అధిపత్యం లోని భాగంగా పరమత సహనం కు చిహ్నంగా చేస్తున్న చర్యలా?

paris attacks

                                          ---

ప్రపంచ రాజకీయాలలో కుట్రలు సహజం, కాని దానికి విపరీత అర్ధాలు, కారణాలు తీస్తూ, ఒక దేశ పతనానికి వేరే వాళ్ళను నిందిచడం తేలిక కావచ్చు, కాని ఆ దేశ ప్రజల మౌనం , ముర్కత్వం కూడా దానికి కారణం అని చెప్పి సమస్యను పరిష్కరించకుండా వాళ్ళ తప్పు ఏమి లేదు అనే చెప్పడం సమస్యను పొడిగించడమే లేదా తప్పు దోవ పట్టించే విధంగా ఉంది.

Related Posts Plugin for WordPress, Blogger...