Pages

Wednesday 13 January 2016

నమస్తే తెలంగాణా పత్రిక లో మల్దా జిల్లా, పశ్చిమ బెంగాల్ లో జరిగిన అల్లర్లపై తప్పుడు సమాచారం



నమస్తే తెలంగాణా పత్రికలో 12-జనవరి-2016 నాడు, పేజి 5 లో  “బీజెపి టిఎంసి పొలిటికల్ వార్” అనే శీర్షిక కింద వ్రాసిన ఒక వార్త లో పశ్చిమ బెంగాల్, మల్దా జిల్లలో జరిగిన అల్లర్ల పై ముఖ్య కారణం ఒక బిజెపి నాయకుడు చేసిన రాయడం జరిగింది. 


కాని ఇది వాస్తవం కాదు. కమలేశ్  తివారి, హిందూ మహాసభ అనే సంస్థకు చెందిన వ్యక్తి , మహమ్మద్ పై చేసిన వ్యాక్యలకు నిరసనగా, అతన్ని ఉరి తియ్యాలి అనే నినాదాలతో తో అంజుమన్ అహలె సున్నతుల్ జమాత్ అనే ముస్లిం సంస్థ ర్యాలీ తీయడం జరిగింది. అదే ర్యాలీ లో భారీ సంఖ్యలో పాల్గొన్న ముస్లిమ్స్ తివారికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ పోలీస్ స్టేషన్ మరియు అక్కడే పక్కకు ఉన్న మార్కెట్ లోని కొన్ని దుకాణాలు, హిందువుల ఇండ్లు, వాహనాలు ద్వంసం చేయడం జరిగింది.

నాకు తెలిసిన మటుకు  కమలేశ్ తివారి  ప్రస్తుతం బిజెపి నాయకుడు కాదు. 

ఇదే విషయాన్నీ దాదాపు సంఘటన జరిగిన మూడు రోజుల తరువాత కొన్ని జాతీయ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు తెలియ చేసినారు. 

కాని ఈ పూర్తి విషయం తెలువని నమస్తే తెలంగాణా పాఠకుడు ఈ వార్తను చదివిన తరువాత కేవలం ఒక బిజెపి నాయకుడు చేసిన వ్యాక్య వల్లనే ఈ అల్లరి జరిగింది అని నమ్మే ఆస్కారం ఉంది.  అంటే ఈ పత్రిక వల్ల ఒక అబద్ధం ప్రచారం అవుతున్నట్టే కదా?

ఇంత సున్నితమైన అంశాన్ని పూర్తిగా తెలుసుకోకుండా వార్త రాయడం జరిగిందా? లేదా కావాలని పాఠకులను తప్పు దోవ పట్టించాలని రాసిందా?




పత్రికలో వచ్చిన పూర్తి వార్త

























పశ్చిమ బెంగాల్, మల్దా జిల్లలో జరిగిన అల్లర్ల పై సోషల్ మీడియా పై ఉన్న కొన్ని వీడియోలు.
https://www.facebook.com/prasunmaitra/videos/10153525863399865/

https://www.facebook.com/TapanGhoshPersonal/videos/984278341666619/

ఇదే సంఘటన పై నేను రాసిన వ్యాసం:

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...