Pages

Friday 22 January 2016

ఉస్మానియా యూనివర్సిటీలో మావోయిస్టు లతో సంబంధాలు ఉన్న ప్రొఫెసర్

విశ్వ విద్యాలయాలలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయరాదు. రోహిత్ వేముల అనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి జీవితంలో యాకుబ్ మెమన్ కు సానుభూతి అనే పేరుతో మొదలై న సంఘటనలు అతని మరణానికి ఒక కారణం అయినవి. తన విద్యార్ధి ప్రయాణంలో ఎంతో మంది ప్రొఫెసర్లు, పెద్ద వాళ్ళు, తోటి స్నేహితులు, సమాజం రోహిత్ వ్యక్తిత్వం మీద ప్రభావం చేసి ఉంటుంది. ఇప్పటి వరకు అయితే రోహిత్ సంఘటనపై మాత్రం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో చట్ట వ్యతిరేక సంస్థలను సమర్ధిస్తున్న వ్యక్తులు గాని, ప్రొఫెసర్ ల పై ఎలాంటి వార్త రాలేదు. సంతోషం. 

కాని ఈ రోజు (22-January-2016) నమస్తే తెలంగాణా పత్రిక లో వచ్చిన వార్త "“మావోయిస్టు సానుభుతిపరుడి లొంగుబాటు” ప్రకారం ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చింతకింది ఖాసిం అలియాస్ కార్తిక్ కు మరియు మావోయిస్టు కేంద్ర కమిటి సభ్యుడు చంద్రన్న అలియాస్ ఆత్రం కు మద్య ఉత్తర ప్రత్యుత్తరాలు చేరవేసే కొరియర్ లొంగిపోయినట్టు వార్త. మరి పోలీస్ వాళ్ళు ఏమైనా చర్య తీసుకుంటారా ? లేదా ఏదైనా రాజకీయనాయకుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడా? ఉస్మానియా యూనివర్సిటీ లో చట్ట వ్యతిరక శక్తులు ఉన్నాయి, మీరు దర్యాప్తు చేయండి అని. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు లేఖ రాస్తారో, లేదా ఏ విద్యార్థి సంస్థ వాళ్ళు రాస్తారో చూడాలని ఉంది.  
ఇంతకుముందే మనం ఉస్మానియా యూనివర్సిటీ చదువుతున్న వివేక్ అని విద్యార్ధి ఎంకౌంటర్ మనకు గుర్తు. అప్పుడు చాల బాధ పడ్డం, అరె ! మంచి విద్యార్ధి సచ్చిపోయిండు కదా అని భాధపడ్డం, మరి ఒక వేల ఇట్లాంటి ప్రొఫెసర్ విద్యార్థుల మీద ఎట్లాంటి ప్రభావం చూపవచ్చు....ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహిరిస్తే మరో వివేక్ లేదా రోహిత్ లాంటి విద్యార్థుల మరణం ఆపిన వాళ్ళం అవుతాము కాదా...


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...